అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు

Monday,February 04,2019 - 06:59 by Z_CLU

సంక్రాంతి బరిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలిచాడు అనిల్ రావిపూడి. ‘అంతేగా అంతేగా’ అంటూ ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది F2. అందుకే 100% కామెడీ టైమింగ్ ఉన్న ఈ డైరెక్టర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వెదుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ విషయంపై ప్రస్తుతానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఆల్మోస్ట్ అనిల్ సుంకర, మహేష్ బాబు సొంత బ్యానర్  MB ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందనే టాక్ టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. వరసగా భారీ కమర్షియల్ సినిమాలు చేస్తున్న మహేష్ బాబు ఫర్ ఎ చేంజ్, ఈ సారి హిలేరియస్ ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుది.

ఏది ఏమైనా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘మహర్షి తరవాత ఇమ్మీడియట్ గా సుకుమార్ తో సెట్స్ పైకి వస్తాడు మహేష్ బాబు. ఆ తర్వాతే ఏ సినిమా అయినా. కాబట్టి ఈ 2 సినిమాల గ్యాప్ లో అనిల్ రావిపూడి తో సినిమా ఉంటుందా లేదా..? లేకపోతే ఇది జస్ట్ రూమరా అనే క్లారిటీ వచ్చేస్తుంది.