అదీ విజయ్ దేవరకొండ !!

Monday,February 04,2019 - 06:12 by Z_CLU

రోజు రోజుకి మరింత పాపులర్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. జస్ట్ ఆన్ స్క్రీన్ మాత్రేమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా అదే స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. డిఫెరెంట్ మ్యానరిజంతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటాడు. అందుకే ఫోర్బ్స్ మ్యాగజైన్  ‘ 30 అండర్ 30 2019’ లో విజయ్ దేవరకొండ పేరును చేర్చింది.

అయితే ఈ లిస్టులో ఈ సంవత్సరం ఇండియా నుండి ప్లేస్ సంపాదించుకున్న వన్  అండ్  ఓన్లీ  ఇండియన్  విజయ్ దేవరకొండ అవ్వడం విశేషం. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి కూడా ఎవరూ ఈ లిస్టులో చోటు దక్కించుకోలేదు. దాంతో వరల్డ్ సినిమా దృష్టి విజయ్ దేవరకొండ పై పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన 30 ఏళ్ల లోపు ఉన్న 30 మంది యువకుల్లో విజయ్ దేవరకొండ  ఉన్నట్టు గుర్తించింది ఫోర్బ్స్ మ్యాగజైన్.

ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రతి సినిమాలాగే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి ఫ్యాన్స్ లో. స్టోరీ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.