జీ సినిమాలు ( 5th ఫిబ్రవరి )

Monday,February 04,2019 - 10:06 by Z_CLU

కుక్కలున్నాయి జాగ్రత్త

నటీనటులు : సిబిరాజ్, అరుంధతి

ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్

డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్

ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్

రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014

సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

==============================================================================

త్రిపుర

నటీనటులు స్వాతి రెడ్డినవీన్ చంద్ర

ఇతర నటీనటులు : రావు రమేష్సప్తగిరిశివన్నారాయణ నడిపెద్దిజయ ప్రకాష్ రెడ్డిప్రీతీనిగమ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్

రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015

స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్పల్లెటూరిలో పెరిగినత్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలువస్తుంటాయిఅవి కాస్తా నిజమవుతుంటాయిదాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకితీసుకువస్తారుఅక్కడ నవీన్ చంద్రత్రిపురలు ప్రేమలో పడతారుపెళ్ళి కూడాచేసేసుకుంటారు తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశంసస్పెన్స్ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

చింతకాయల రవి

నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, వేణు తొట్టెంపూడి, శయాజీ షిండే, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్

డైరెక్టర్ : యోగి

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008

చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్, రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.

==============================================================================

పిల్ల జమీందార్

నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

=============================================================================

శతమానం భవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్

డైరెక్టర్ : సతీష్ వేగేశ్న

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

==============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.