అల్లు శిరీష్ 'ABCD' హైలెట్స్

Thursday,May 16,2019 - 11:02 by Z_CLU

రేపే రిలీజవుతుంది అల్లు శిరీష్ ABCD. మళయాళ బ్లాక్ బస్టర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లోను సక్సెస్ గ్యారంటీ అనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. యూత్ ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలోని హైలెట్స్ ఇవే.

అల్లు శిరీష్ : ఈ మెగా హీరో స్క్రిప్ట్ సెలక్షనే డిఫెరెంట్. మరీ హడావుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా, ప్రతిసారి ఏదో కొత్తదనం వస్తాడనే ఫీలింగ్ ఆడియెన్స్ లో ఉంది. అదే ఫీలింగ్ తో ABCD రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిటింగ్.

కథ : ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కథ. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి స్టార్ డమ్ తీసుకొచ్చి పెట్టిన స్టోరీలైన్. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎలిమెంట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. ట్రయిలర్ లో కూడా అదే కనిపించింది.

మ్యూజిక్ : ఇప్పటికే కన్నడలో 8 కి పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజర్ చేసిన జుడా శాండీ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.  సాంగ్స్ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా “మెల్లమెల్లగా..” అనే సాంగ్ అయితే ఈ ఏడాది చార్టబస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

కామెడీ : అమెరికా నుండి వచ్చిన యంగ్ NRI, ఇండియాలో చాలీ చాలని బడ్జెట్ తో ఎడ్జెస్ట్ అవ్వడమనేది కథ  అవుట్ లైన్ అయితే, ఆ పరిస్థితుల్లో హీరో ఫేస్ చేసే పరిస్థితులు సినిమాలో కావాల్సినంత కామెడీని జనరేట్ చేయబోతున్నాయి. సినిమాలో మోస్ట్ కనెక్టింగ్ ఎలిమెంట్ కామెడీ.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు సినిమాని. సినిమా బిగినింగ్ హీరో లగ్జరియస్ లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేసే అమెరికన్ లైఫ్ స్టైల్ తో పాటు ప్రతీది కథకు తగ్గట్టు రిచ్ ఫార్మాట్ లో ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన విజువల్స్ చూస్తే, ఆ రిచ్ నెస్ క్లియర్ గా తెలిసిపోతుంది.