ABCD వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Tuesday,June 18,2019 - 10:15 by Z_CLU

ఈ వీకెండ్ తన అభిమాన ప్రేక్షకుల కోసం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ABCDని సిద్ధంచేసింది జీ తెలుగు.

జూన్ 23న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ABCDని చూసి ఎంజాయ్ చేయండి.

అమెరికాలో పుట్టి పెరిగిన అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగి జల్సాలకు, రిచ్ కల్చర్‌కు అలవాటుపడతాడు. అరవింద్ కు డబ్బు, జీవితం విలువ తెలియాలనే ఉద్దేశంతో విద్యా ప్రసాద్ (నాగబాబు) కొడుకుని ఇండియా వెళ్లి ఎంజాయ్ చేయమని, తోడుగా కజిన్ బాషా(భరత్)ను కూడా తీసుకెళ్లమని చెప్పి నమ్మించి హైదరాబాద్‌కు పంపుతారు. తన తండ్రి తనకు డబ్బులు అందకుండా చేసి, హైదరాబాద్ లో సాదాసీదా జీవితం గడపడానికి పంపించాడనే విషయం అరవింద్ కి ఆ తర్వాత తెలుస్తుంది. అమెరికా లో లక్షలు ఖర్చుపెట్టే అవినాష్ ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు.. అతడిలో ఎలాంటి మార్పు వచ్చిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది అమెరికన్ బోర్న్ కంఫ్యూజ్డ్ దేసీ (ఏబిసిడి).

అల్లు శిరీష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ABCD మూవీని ఎక్స్ క్లూజివ్ గా జీ తెలుగు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.

సూపర్ హిట్ సాంగ్స్, ఫైట్స్ తో పాటు హిలేరియస్ కామెడీతో వీకెండ్ ను మరింత కలర్ ఫుల్ గా మార్చుకోండి.