రుక్సార్ థిల్లాన్ – ABCD కలిసొస్తుందా..?

Thursday,May 16,2019 - 12:03 by Z_CLU

2017లో ‘ఆకతాయి’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది రుక్సార్ థిల్లాన్… ఈ సినిమా పెద్దగా కలిసిరాకపోయినా, ఇమ్మీడియట్ గా నాని ‘కృష్ణార్జున యుద్ధం’ లో అవకాశం దక్కించుకుంది. కాకపోతే ఈ సినిమా ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడం చిన్న డ్రా బ్యాక్. అంతలో లక్కీగా ‘ABCD’ లో చాన్స్ దొరకడం రుక్సార్ కి ఊరటనిచ్చింది. మరి ABCD  ఈమెకు కలిసొస్తుందా…?

‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ ఏమైనా ‘ABCD’లో అవకాశం మాత్రం ఆ సినిమా వల్లే వచ్చింది. క్యారెక్టర్ డిమాండ్ చేసిన స్థాయి వరకు పెర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేసింది. కానీ మాస్ హీరోయిన్ గా ఈ రెండేళ్లలో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో వెనకబడింది రుక్సార్.

ABCD లో రుక్సార్ కి ఏ స్థాయిలో పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందనేది ఇంకో రోజులో తేలిపోతుంది కానీ, ఇప్పటికిప్పుడు ఆడియన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే రుక్సార్ కి చాలా ఉంది.

ప్రస్తుతానికి ABCD తప్ప ఇంకో సినిమాకి సంతకం చేయలేదు ఈ బ్యూటీ. చేసిన సినిమాల అంకె చిన్నదే అయినా, రుక్సార్ మాత్రం పక్కా ప్లానింగ్ తో సినిమాలను ఎంచుకుంటుంది. ABCD సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న రుక్సార్, ఈ సినిమా తరవాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాలనే ప్లానింగ్ లో ఉంది.