పూర్తిగా కోలుకున్న కమల్... త్వరలోనే సెట్స్ పైకి...

Thursday,July 21,2016 - 04:19 by Z_CLU

అవును… లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. కాలికి దెబ్బ తగలడంతో 2 వారాలుగా మంచానికి పరిమితమైన కమల్ హాసన్… త్వరలోనే శభాష్ నాయుడు సినిమా సెట్స్ పై ప్రత్యక్షం కానున్నాడు. ఇన్నాళ్లూ వచ్చిన గ్యాప్ ను జెట్ స్పీడ్ తో భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు.కమల్ హాసన్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో శృతిహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో శభాష్ నాయుడు సినిమా షూటింగ్ కొన్ని రోజుల కింద ప్రారంభమైన విషయం తెలిసిందే. అమెరికాలోనే ఈ సినిమా షూటింగ్ ను మ్యాగ్జిమమ్ పూర్తిచేశారు. భారీ షెడ్యూల్ ముగిసింది. అయితే ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత… ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు… ప్రమాదవశాత్తూ కమల్ కాలుజారిపడ్డాడు.అతడి కాలికి చిన్న గాయమైంది. డాక్టర్లు ఆయన్ను 2 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు.డాక్టర్లు చెప్పిన టైం కంటే కాస్త ముందుగానే కమల్ కోలుకున్నాడు. వీలైనంత త్వరగా శభాష్ నాయుడు సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు.నిజానికి ఈ ప్రాజెక్టు కు కుమార్ దర్శకత్వం వహించాల్సి ఉన్నప్పటికీ… అతడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. దర్శకత్వ బాధ్యతల్ని కూడా కమల్ హాసనే తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం అవుతుంది.