అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీస్

Tuesday,March 05,2019 - 02:57 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ‘నా పేరు సూర్య’ తరవాత ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి రాలేదు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ‘మే’ లో ‘నా పేరు సూర్య’ రిలీజయితే ఇప్పటి వరకు మళ్ళీ  కొత్త సినిమా సెట్స్ పైకి రాలేదు. ఈ లెక్కన చూస్తే, తరవాతి సినిమా సెట్స్ పైకి వచ్చి రిలీజయ్యే నాటికీ, సంవత్సరానికి పైగా గ్యాప్ వచ్చినట్టే. అందుకే ఈ గ్యాప్ ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫిల్ చేసే ఆలోచనలో ఉన్నాడు బన్ని.

త్రివిక్రమ్ : ఆల్మోస్ట్ సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉంది ఈ కాంబో. కాకపోతే ఎక్కడో బన్ని లుక్స్ విషయంలో కొంచెం టైమ్ పడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ‘జులాయి’, ‘S/o సత్యమూర్తి’ లాంటి హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ విషయంలో ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో, బన్ని కూడా  అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

సుకుమార్ : జస్ట్ నిన్ననే అనౌన్స్ అయిందీ సినిమా.అసలీ డిస్కర్షన్స్ ఎప్పుడు జరిగాయి..? ఎప్పుడు ప్లాన్ చేసుకుని ఉంటారు లాంటివి పక్కన పెడితే, ఈ కాంబో అనౌన్స్ అవ్వడం ఫ్యాన్స్ కి పెద్ద సర్ ప్రైజే.

మురుగదాస్ : ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ రేపో మాపో, మురుగదాస్ తో సినిమా అంటూ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే చాన్సెస్ కనిపిస్తున్నాయి. డిఫెరెంట్ కాన్సెప్ట్స్ ని స్క్రీన్ పైకి తీసుకు వచ్చే మురుగదాస్, బన్ని తో మాస్  ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.