అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ఫిక్స్

Friday,August 02,2019 - 04:14 by Z_CLU

ఒకేసారి 3 సినిమాలు ఎనౌన్స్ చేయడంలో బన్నీ అప్ కమింగ్ మూవీస్ పై చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉండేది. అయితే ఇది నిన్నటివరకే. తన లైనప్ పై బన్నీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ మెగా హీరో, దీని తర్వాత సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రీసెంట్ గా హీరో-దర్శకుడి మధ్య ఫైనల్ స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. టోటల్ స్క్రీన్ ప్లే విని చాలా థ్రిల్ ఫీలయ్యాడు బన్నీ. వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈనెలలోనే సుకుమార్-బన్నీ సినిమా లాంఛ్ అవుతుంది. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. నిజానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా సెట్స్ పైకి తీసుకొస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ బన్నీ మాత్రం తనకు తొలి కమర్షియల్ సూపర్ హిట్ అందించిన సుక్కూకే ఓటేశాడు.