118 మూవీ 4 రోజుల కలెక్షన్

Tuesday,March 05,2019 - 12:51 by Z_CLU

కల్యాణ్ రామ్, నివేత థామస్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించిన 118 సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. శివరాత్రి హాలిడే కూడా కలిసిరావడంతో వీకెండ్ కు అదనంగా మరో రోజు దొరికినట్టయింది. ఫలితంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

తెలుగులో రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 రోజుల్లో 5 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధిస్తుంది. కేవీ గుహన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా, కల్యాణ్ రామ్ హిట్ మూవీస్ లిస్ట్ లోకి చేరబోతోంది.

ఏపీ, నైజాం 4 రోజుల షేర్
నైజాం – రూ. 2.44 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.61 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.24 కోట్లు
గుంటూరు – రూ. 0.44 కోట్లు
కృష్ణా – రూ. 0.43 కోట్లు
నెల్లూరు – రూ. 0.13 కోట్లు