అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

Tuesday,August 13,2019 - 12:13 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆగస్ట్ 15న ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందే ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు వైకుంఠపురంలో.. అనే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. మరో 48 గంటల్లో ఈ మేటర్ పై ఓ క్లారిటీ వస్తుంది.

తన సినిమాలకు డిఫరెంట్ టైటిల్స్ పెట్టడంలో త్రివిక్రమ్ దిట్ట. అజ్ఞాతవాసి, అరవిందసమేత, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి విలక్షణమైన టైటిల్స్ ఇలా పుట్టుకొచ్చినవే. ఇప్పుడిదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, బన్నీ సినిమాకు వైకుంఠపురంలో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టున్నాడు త్రివిక్రమ్.

ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పేలా తెరకెక్కుతోంది ఈ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత పెతురాజ్ సెకెండ్ హీరోయిన్. నవదీప్, సుశాంత్, టబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.