జీ సినిమాలు ( 13th ఆగష్టు )

Monday,August 12,2019 - 10:59 by Z_CLU

బంపర్ ఆఫర్

నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

==============================================================================

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

=============================================================================

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ జె.బి

డైరెక్టర్ మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలెట్స్.

==============================================================================

బ్రహ్మోత్సవం
నటీనటులు మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ :  20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

సైనికుడు
నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ :  అశ్విని దత్
రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006
మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

=============================================================================

ఉన్నది ఒకటే జిందగీ

నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, కిరీటి దామరాజు, హిమజ, అనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కిషోర్ తిరుమల

ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు. ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.