లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన బన్నీ

Saturday,February 29,2020 - 01:33 by Z_CLU

మొన్నటివరకు అల వైకుంఠపురములో సక్సెస్ ను ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు పూర్తిగా సుకుమార్ సినిమాపై దృష్టిపెట్టాడు బన్నీ. త్వరలోనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. బన్నీకి సంబంధించిన తొలి షెడ్యూలే చాలా భారీగా ప్లాన్ చేసింది యూనిట్.

సాధారణంగా ఫస్ట్ టైమ్ హీరో సెట్స్ పైకి వచ్చే సందర్భాల్లో ఆ షెడ్యూల్ ను షార్ట్ గా ముగిస్తారు. తర్వాత లెంగ్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. హీరో ఎడ్జెస్ట్ మెంట్ కోసం ఇలా చేస్తారు. కానీ సుకుమార్ మాత్రం బన్నీతో షెడ్యూల్ ను ఏకంగా 40 రోజులు ప్లాన్ చేశాడు.

కేరళలోని అడవుల్లో, మార్చి ఎండింగ్ నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. సెట్స్ పైకి రావడమే ఇలా భారీ షెడ్యూల్ తో వస్తున్నాడు అల్లు అర్జున్. మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో వస్తోంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.