కరోనా ఎఫెక్ట్: టార్గెట్ మిస్సయ్యాడు

Sunday,April 12,2020 - 12:14 by Z_CLU

అవును… అన్నీ అనుకున్నట్లు జరిగితే బన్నీ ఫ్యాన్స్ కి 2020 ఎప్పటికి గుర్తుండిపోయే ఇయర్ అయ్యుండేది. ఎందుకంటే స్టైలిష్ స్టార్ ఈ ఇయర్ రెండు రిలీజ్ లు ప్లాన్ చేసుకున్నాడు. ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోయే పుష్ప సినిమాను కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్నాడు. సుక్కు కూడా ఈ సారి మేకింగ్ కోసం తక్కువ రోజులే తీసుకోవాలనుకున్నాడు.

కేరళలో ఓ చిన్న షెడ్యుల్ పూర్తిచేసి బన్నీ తో ఓ భారీ షెడ్యుల్ అనుకునే సరికి అనుకోకుండా సినిమాకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. అందువల్ల కేరళలో జరగాల్సిన షెడ్యుల్ క్యాన్సల్ అయింది. ప్రస్తుతం తదుపరి షెడ్యుల్ ను ఆంద్రప్రదేశ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే యూనిట్ ఈస్ట్ గోదావరిలోని మారేడుమిల్లి ప్రాంతంలో కీలక సన్నివేశాలు తీయనున్నారు.

‘నా పేరు సూర్య’ తర్వాత గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఇయర్ ఈ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేయాలనుకున్నాడు. కానీ కరోనా వైరస్ వల్ల ఆ టార్గెట్ మిస్సయ్యాడు. పుష్ప ఈ ఏడాది థియేటర్లలోకి రాదు.