పుష్ప మూవీ.. కీలకమైన పని పూర్తి

Wednesday,July 08,2020 - 02:02 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప సినిమా సెట్స్ పైకి రాలేదన్న మాటే కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కలిసి ఈ సినిమాకు సంబంధించి ఓ మేజర్ వర్క్ పూర్తిచేశారు.

అవును.. పుష్ప సినిమాకు సంబంధించి 5 ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. లాక్ డౌన్ వల్ల ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే… ఆన్ లైన్ మ్యూజిక్ సిట్టింగ్స్ ద్వారా పాటలన్నీ పూర్తిచేశారు. బన్నీ నుంచి కూడా ఈ సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఈ పాటల రికార్డింగ్ కూడా పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారు దేవి-సుక్కూ. చేతిలో పాటలు రెడీగా ఉంటే ఇక సినిమాను పరుగులు పెట్టించడం ఈజీ. ఎందుకంటే టాకీ పార్ట్ కు ఇబ్బంది ఎదురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాంగ్ షూటింగ్ మొదలుపెట్టొచ్చు కదా.

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, తక్కువ మంది యూనిట్ తో షూటింగ్ సాధ్యం కాకపోతే.. పాటల్ని ముందుగా పిక్చరైజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే సాంగ్స్ కు ఎక్కువ క్రూ అవసరం లేదు.