'పుష్ప' ఫస్ట్ లుక్... బన్నీ మాస్

Wednesday,April 08,2020 - 10:03 by Z_CLU

‘#AA20’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా #AA20 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించనున్న ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్ పెట్టారు.

కొద్దిసేపటి కిందట బన్నీ మాస్ లుక్ తో ఓ పోస్టర్ వదిలి టైటిల్ రివీల్ చేసారు. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో ఇతడి పేరు పుష్పరాజ్. షార్ట్ కట్ లో అంతా పుష్ప అని పిలుస్తారు. అదే సినిమా టైటిల్.

హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే సుకుమార్ ఇప్పుడు బన్నీని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేసి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాడు. పోస్టర్ లో లుక్ చూస్తుంటే బన్నీ సినిమాలో కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తాడని అర్థమవుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ఈస్ట్ గోదావరిలోని మారేడుమిల్లిలో జరగనుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.