ఆగష్టు నుండి అల్లు అర్జున్ సినిమా

Monday,July 17,2017 - 01:15 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ ప్రీ ప్రొడక్షన్ కి  ఆల్మోస్ట్ ప్యాకప్ చెప్పేసింది. ఆగష్టు ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్. ఈ సినిమాకి కావాల్సిన తక్కిన నటీనటులను ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది.

అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యువెల్ నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బన్ని ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి  విశాల్ -శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

బన్ని రీసెంట్ బ్లాక్ బస్టర్ DJ తరవాత ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి రానున్న ఈ సినిమా, ఇప్పటికే ఫ్యాన్స్ లో హాయ్ ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.