40 ఏళ్ళ మెగా సెలెబ్రేషన్స్

Monday,July 17,2017 - 12:47 by Z_CLU

మెగాస్టార్ కరియర్ లో మరో మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన మెగాస్టార్ సక్సెస్ ఫుల్ గా 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ అకేషన్ ని గ్రాండ్ గా  సెలెబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనిలో భాగంగా 40 రోజులపాటు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ తో పాటు, పలు సేవా కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

జూలై 14 న అమెరికాలోని వాషింగ్టన్ లో ఫస్ట్ బ్లడ్ క్యాంప్ నిర్వహించి మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ బిగిన్ చేసిన ఆప్త ఆర్గ‌నైజేష‌న్, 40 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇక విశాఖ లోని గాజువాక దగ్గర మొదటి రక్తదాన శిబిరం నిర్వహించి, అక్కడే  మెగాస్టార్ 40 వ‌సంతాల వేడుక‌ల‌ను ఘ‌నంగా ప్రారంభించారు ఫ్యాన్స్.

 

ఒక్క ఇండియాలోనే 400 బ్లడ్ క్యాంపులను నిర్వహించనున్న ఫ్యాన్స్ అసోసియేషన్, అమెరికాలో 40, మిడిల్ ఈస్ట్, దుబాయ్, మస్కట్ లలో 14 బ్లడ్ క్యాంపులను నిర్వహిస్తుంది.