మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర

Monday,July 17,2017 - 03:14 by Z_CLU

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. అల్టిమేట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా హైదరాబాద్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇవాళ్టి నుండి మలేషియాలో మూడో షెడ్యూల్ బిగిన్ చేసేసిన ఆచారి టీమ్, 25 రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంది.

మలేషియా తరవాత ఇమ్మీడియట్ అమెరికా బయలుదేరనున్న సినిమా యూనిట్, అక్కడే మరో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటుంది. సినిమాలోని అతి కీలక సన్నివేశాలను అక్కడే ప్లాన్ చేసుకుంటున్న ఆచారి టీమ్, ఈ షెడ్యూల్ తో సినిమాకి ప్యాకప్ చెప్పేయనుంది. బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటిస్తుంది. S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.