Pushpa - మొదలైన లీకుల గోల

Friday,November 20,2020 - 06:41 by Z_CLU

ఓ పెద్ద సినిమా సెట్స్ పైకి వస్తుందంటే చాలు, ఆ వెంటనే లీకులు మొదలైపోతాయి. ఇప్పుడు PUSHPA సినిమాకు కూడా ఇదే పెద్ద సమస్యగా మారింది.

ఈ సినిమాకు సంబంధించి మేజర్ హైలెట్ ఏదైనా ఉందంటే అది బన్నీ గెటప్ మాత్రమే. అలాంటి కీలకమైన బన్నీ లుక్ లీక్ అయింది. సెట్స్ లో బన్నీ ఉన్నప్పుడు ఎవరో సీక్రెట్ గా ఫొటో తీసి దాన్ని నెట్ లోకి ఎక్కించారు.

దీంతో పుష్ప సినిమాలో Allu Arjun ఎలా ఉంటాడో అందరికీ తెలిసిపోయింది. నిజానికి ఈ గెటప్ కోసం బన్నీ బాగా జుట్టు, గడ్డం పెంచాడనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే తాజా లీకులతో అతడి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా బయటకొచ్చేసింది.

లీకులు మొదలైన వెంటనే యూనిట్ ఎలర్ట్ అయింది. ఇకపై ఎవ్వరూ సెట్స్ లోకి మొబైల్స్ తీసుకురాకూడదని కండిషన్ పెట్టింది.

Also Check – బన్నీ-సుక్కూ టాార్గెట్ ఇదే