అల్లు అర్జున్

Monday,June 06,2016 - 05:38 by Z_CLU

అల్లు అర్జున్ ఏప్రిల్ 8 , 1983 లో జన్మించారు. అల్లు అర్జున్ ప్రముఖ హాస్యనటులు అల్లు రామలింగయ్య మనవడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు. ‘గంగోత్రి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో కథానాయకుడిగా విజయం అందుకోవడం తో పాటు నంది అవార్డు ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ‘ఆర్య’ చిత్రం తో మరో విజయం అందుకొని నంది అవార్డు అందుకున్నఅల్లుఅర్జున్’బన్నీ’, ‘హ్యాపీ’,’దేశముదురు’,’పరుగు’,’ఆర్య-2 ‘,’వేదం’,’బద్రినాధ్’, వంటి సినిమాలలో నటించారు. ‘జులాయి’,’రేసు గుర్రం’,’సన్ అఫ్ సత్యమూర్తి’,’సరైనోడు’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా రెండు నంది అవార్డులను, మూడు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు మరి కొన్ని అవార్డులను సొంతం చేసుకున్నారు.

Born : April 8th 1983
Height : 5' 9 (1.88m)

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు