Ileana - ఇప్పట్నుంచే నయా ప్లాన్స్

Friday,November 20,2020 - 06:51 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత హీరోయిన్లంతా టూర్స్ చెక్కేస్తున్నారు. ఇప్పటికే చాలామంది మాల్దీవుల్లో ల్యాండ్ అయ్యారు. మిగతా హీరోయిన్లంతా ఓవైపు షూటింగ్స్ పూర్తిచేస్తూనే, మరోవైపు వెకేషన్ పై స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా ఇలియానా కూడా చేరింది.

తన చేతిలో ఉన్న ఓ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనుకుంటోంది ఇలియానా. ఒకవేళ డిసెంబర్ నాటికి ఆ సినిమా కంప్లీట్ అవ్వకపోయినా.. క్రిస్మస్ కు ఆమె కచ్చితంగా లీవ్ పెట్టాలనుకుంటోంది.

ఎందుకంటే.. క్రిస్మస్ కు అమెరికా టూర్ ప్లాన్ చేసింది Ileana. యూఎస్ లో ఇలియానా తల్లి, సోదరి ఉంటున్నారు. వాళ్లను కలవడంతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాల్ని వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవాలని ఈ గోవా బ్యూటీ డిసైడ్ అయింది.