RRR - సీత వచ్చేసింది

Monday,March 15,2021 - 11:57 by Z_CLU

ఆదిపురుష్ సినిమాలో సీత ఎవరనేది తెలిసిపోయింది. ఇప్పుడు RRR వంతు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. “రామరాజు కోసం ఎదురుచూస్తున్న సీత” అంటూ అలియా భట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

క్యారెక్టర్స్ పండించడంలో అలియా టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. అలాంటి హీరోయిన్ ను ఆర్ఆర్ఆర్ లోకి తీసుకున్నప్పుడే ఏదో మంచి పాత్ర ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ అంచనాలకు తగ్గట్టే సీత లుక్ లో అలియాభట్ అదరగొట్టింది.

alia as Sita in RRR

అచ్చ తెలుగు ఆడపడుచులా సంప్రదాయబద్ధమైన చీరకట్టులో రామరాజు కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న సీతగా అలియా భట్ లుక్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.