చైతు సమంతాల సినిమాపై భారీ అంచనాలు

Monday,July 23,2018 - 10:59 by Z_CLU

నాగచైతన్య సమంతాల కొత్త సినిమా లాంచ్ అయింది. పెళ్ళి తరవాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో, శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా ఉండబోతుందన్నది తెలిసిన విషయమే అయినా, ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ రోజు లాంచ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఈ ఈవెంట్ కి నాగార్జున చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.

పెళ్ళి తరవాత ఫస్ట్ టైమ్ కలిసి నటించబోతున్నారు సమంతా, నాగచైతన్య. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా చుట్టూ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా స్టోరీలైన్ లాంటివి ప్రస్తుతానికి రివీల్ కాకపోయినా, ఈ రియల్ లైఫ్ కపుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై ఫ్యాన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ‘ఏ మాయ చేశావే’  ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ తరవాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న 4 వ సినిమా ఇది.

 

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి  ప్యాకప్  చెప్పిన ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.