జీ సినిమాలు ( 23rd జూలై )

Monday,July 23,2018 - 12:08 by Z_CLU

అమరావతి

నటీనటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంఅమరావతి’. చిత్రం లో భూమిక, స్నేహ నటన,  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన  తారకరత్న చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో సినిమా అలరిస్తుంది.

============================================================================

ప్రేమించుకుందాం రా

నటీనటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

============================================================================

సౌఖ్యం

నటీనటులు : గోపీచంద్, రెజీనా కసాంద్ర

ఇతర నటీనటులు : ముకేష్ రిషి, ప్రదీప్ రావత్, దీవన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి

ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్

రిలీజ్  డేట్ :  24  డిసెంబర్ 2015

గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ఫ్యాఅమిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్  కిడ్నాప్ చేస్తారు. గొడవాలంటే ఇష్టపడని హీరో ఫాదర్, ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================================================================

బావ

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ మలుపు తిరుగుతుందన్న అంశాలు జీ సినిమాలు  లో చూడాల్సిందే.

============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్బ్రదర్ అఫ్ బొమ్మాలి’. సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందికోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.