యూటర్న్ తీసుకున్న సమంత

Monday,July 23,2018 - 11:15 by Z_CLU

మొన్నటివరకు రామలక్ష్మిగా అలరించిన సమంత ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఇదేదో ఆమె తీసుకున్న కొత్త నిర్ణయం కాదు. యూటర్న్ సినిమా ప్రమోషన్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతోంది ఈ అక్కినేని కోడలు. ఈ మేరకు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

యూటర్న్ సినిమాలో కాస్త పొట్టి జుట్టుతో కనిపించనుంది సమంత. ఫస్ట్ లుక్ లో ఆ విషయాన్ని రివీల్ చేయకపోయినా, వర్కింగ్ స్టిల్స్ లో అది కనిపించింది. ఇక ఫస్ట్ లుక్ చూస్తే మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందనే విషయం తెలుస్తోంది.

ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది సమంత. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తనే రీమేక్ చేయాలని మేకర్స్ ను చాన్నాళ్లు వెయిట్ చేయించింది. రంగస్థలం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేసింది.

ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. సెప్టెంబర్ 13న సినిమాను విడుదల చేయబోతున్నారు.

తారాగణం:
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు..

సాంకేతికవర్గం:
కథ-దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాతలు; శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు
నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
కళ: ఏ.ఎస్.ప్రకాష్
కూర్పు: సురేష్ అరుముగమ్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్