శైలజా రెడ్డి అల్లుడు టీజర్ రివ్యూ

Wednesday,August 01,2018 - 07:22 by Z_CLU

నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ టీజర్ రిలీజయింది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగచైతన్య కి అత్తగా నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సిటివ్ లవ్ ఎలిమెంట్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సీక్వెన్సెస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో సినిమా సక్సెస్ కి కావాల్సినంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు 00 : 48 సెకన్ల  డ్యూరేషన్ తో రిలీజైన ఈ టీజర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.

సినిమాలో హైలెట్ కానున్న 3 క్యారెక్టర్స్ టీజర్ లో ఎలివేట్ అవుతున్నాయి. టూ మచ్ ఈగోతో ఉండే హీరోయిన్ తో పాటు అంతకు మించి అన్నట్టు ఉండే హీరోయిన్ మదర్ శైలజా రెడ్డి, ఈ ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్లో నాగ చైతన్య. ఇలా సినిమా స్టోరీని సింపుల్ గా చెప్పారు టీజర్ లో.

 అనూ ఇమ్మాన్యువెల్ ఈ సినిమాలో హీరోయిన్.  గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగష్టు 31 న గ్రాండ్ గా రిలీజవుతుంది. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా ప్రొడ్యూసర్.