Naga Chaitanya అక్కినేని హీరో ఫుల్ బిజీ

Friday,February 18,2022 - 05:14 by Z_CLU

Naga Chaitanya’s next movies details here

తాజాగా తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమా చేసిన నాగ చైతన్య నెక్స్ట్ వరుసగా సినిమాలు లైన్లో పెట్టాడు. ఇటివలే  ‘థాంక్యూ’ షూట్ పూర్తి చేసిన చైతూ విక్రమ్ కుమార్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. ఫస్ట్ టైం ఓ హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సిరీస్ చేయబోతున్నాడు. ఇక తాజాగా రాహుల్ సంక్రిత్యాన్ తో మరో సినిమా లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది.

అలాగే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. ఈ విషయాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల స్వయంగా చెప్పాడు. దానయ్య డి.వి.వి బేనర్ లో నెక్స్ట్ చెస్తున్నాను.  నాగ చైతన్య తో ఆ సినిమా ఉండనుంది. త్వరలోనే స్క్రిప్ట్ నెరేట్ చేయాల్సి ఉందని తెలిపాడు. ఇవి కాకుండా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ లో ‘మానాడు’ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినబడుతుంది. ఇవి కాకుండా మరో ఇద్దరు చైతూకి స్క్రిప్ట్ చెప్పి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది.

ఇలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు చైతు. ఈ ఏడాది బంగార్రాజు తో సంక్రాంతి బరిలో నిలిచిన చైతు మరో రెండు నెలల్లో ‘థాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఏడాది చివర్లో మరో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే  ఈ ఇయర్ అక్కినేని హీరో నుండి మూడు సినిమాలు రావడం పక్కా అన్నమాట.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics