Bangarraju Teaser అదిరిపోయే రెస్పాన్స్!

Wednesday,January 05,2022 - 01:48 by Z_CLU

కింగ్ నాగార్జున , యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్న ‘బంగార్రాజు‘ సినిమా టీజర్  అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. టీజర్ లో నాగార్జున , చైతన్య సన్నివేశాలు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్  అందరినీ బాగా ఎట్రాక్ట్ చేస్తూ విజువల్ ట్రీట్ అనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీజర్లో నాగ్ , చైతూ కలిసి నడిచే షాట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సినిమాలో మంచి వినోదంతో పాటు ట్విస్టులు , యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని టీజర్ తో హింట్ ఇచ్చారు. ముఖ్యంగా నాగ్ – రమ్యకృష్ణ ని పుటికి అనడం ఆ వెంటనే పుటికి అంటే ఏమిటి ? అనే డైలాగ్ రావడం సినిమాలో ఉండే రొమాంటిక్ మూమెంట్స్ ని ఎక్స్ పోజ్ చేసేలా ఉన్నాయి. అలాగే చైతూ -కృతి లవ్ ట్రాక్ కూడా సినిమాకు హైలైట్ గా నిలవనుందని ఆ ట్రాక్ హిలేరియస్ గా ఉండనుందని అర్థమవుతుంది.  ఫరియా అబ్దుల్లాతో కలిసి నాగ్ , చైతు స్టెప్స్ వేసే టైటిల్ సాంగ్ కూడా సినిమాలో హైలైట్ అవ్వనుందని టీజర్ లో డాన్స్ విజువల్స్ చూస్తే తెలుస్తుంది.

ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది ‘బంగార్రాజు’ సినిమా. ఇప్పటికే టీజర్ 4 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 2 లక్షల లైక్స్ అందుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

ఒక సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సోగ్గాడిగా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగార్జున ఈసారి తనయుడు చైతన్యతో కలిసి మరీ  బంగార్రాజుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సంక్రాంతికి బంగార్రాజు సక్సెస్ తో రీ సౌండ్ చేయడం పక్కా అని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించి రిలీజ్ ట్రైలర్ రాబోతుంది. టీజర్ కంటే ట్రైలర్ తో ఇంకా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు మేకర్స్.

సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రమోషన్ చేస్తున్న మేకర్స్ మరికొన్ని గంటల్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics