మహేష్ బాబు సినిమాలో హైలెట్ కానున్న ఎలిమెంట్

Wednesday,August 01,2018 - 06:45 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది మహేష్ బాబు 25 వ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు లైట్ గెడ్డంతో మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్నాడట. ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే రివీల్ కాలేదు కానీ, సినిమాలో సందర్భానుసారంగా మహేష్ బాబు క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ లా కనిపించనున్నాడు. అయితే సినిమాలోని ఈ క్రికెట్ సీక్వెన్సెస్ ని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ లో తెరకెక్కిస్తున్నారు ఫిలిమ్ మేకర్స్. వీటితో పాటు సినిమాలోని మరిన్ని కీలక యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా ఫిలిమ్ మేకర్స్ ఇదే లొకేషన్ లో తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు, అశ్వని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.