అఖిల్ కొత్త సినిమాపై భారీ అంచనాలు

Thursday,September 27,2018 - 12:03 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన Mr. మజ్ను ఫస్ట్ లుక్ వీడియోతో మోస్ట్ రొమాంటిక్ అనిపించుకున్నాడు అఖిల్. ‘హలో’ లాంటి సూపర్ హిట్ లవ్ ఎంటర్ టైనర్ తరవాత, Mr. మజ్ను లా ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్న అఖిల్ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ డిమాండ్ క్రియేట్ అయి ఉందో, ఈ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే 4 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసింది ఈ వీడియో.

ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు ఫిలిమ్ మేకర్స్. ఇప్పటికే యూత్ హార్ట్ ఫేవరేట్ అనిపించుకున్న అఖిల్, ఈ సినిమాలో మరింత అప్డేటెడ్ పర్ఫామెన్స్ తో ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుందీ సినిమా. నిధి అగర్వాల్ అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.