Agent మనాలిలో షూటింగ్ 

Wednesday,May 25,2022 - 03:43 by Z_CLU

 Akhil Akkineni’s ‘Agent’ Shooting In Manali

 అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్‌ తో పాటు సినిమాలో  కీలక నటీనటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు.

 హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

 హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు , రసూల్ ఎల్లోర్  ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమౌతుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics