సెన్సార్ ప్రిపరేషన్స్ లో NTR అరవింద సమేత

Thursday,September 27,2018 - 11:02 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది NTR అరవింద సమేత. దసరా రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంటున్న ఫిలిమ్ మేకర్స్ అంతే ప్లానింగ్ గా ప్రీ రిలీజ్ ఫార్మాలిటీస్ ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో అక్టోబర్ 6 న ఈ సినిమాని సెన్సార్ క్లియరెన్స్ కి పంపనున్నారు.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ కి సోషల్ మీడియాలో అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తుంది. సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ కాగానే ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్న ఫిలిమ్ మేకర్స్, ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచనున్నారు.

ఈ సినిమాలో NTR సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటి సుప్రియా పాఠక్ కపూర్ NTR కి తల్లిగా కనిపించనుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని హారిక & హాసినీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.