తెలుగు రాష్ట్రాల్లో 'నోటా' పబ్లిక్ మీట్

Thursday,September 27,2018 - 12:31 by Z_CLU

నోటా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విజ‌య‌వాడ‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్ లో ఈ మీటింగులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మీటింగ్స్ ను “ది నోటా ప‌బ్లిక్ మీట్” అని పేరు పెట్టేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా నోటా.

మెహ్రీన్ ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అర్జున్ రెడ్డి.. గీతగోవిందం లాంటి సంచ‌ల‌న సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తోన్న సినిమా ఇది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా నోటా విడుద‌ల కానుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శాంత‌న కృష్ణ‌న్ ర‌విచంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: ఆనంద్ శంక‌ర్

నిర్మాత‌: కే.ఈ. జ్ఞాన‌వేల్ రాజా

నిర్మాణ సంస్థ‌: స‌్టూడియో గ్రీన్

క‌థ‌: షాన్ క‌రుప్పుసామి

సంగీతం: స‌్యామ్ సిఎస్

సినిమాటోగ్ర‌ఫీ:  శాంత‌న కృష్ణ‌ణ్

ఎడిట‌ర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: డి.ఆర్కే. కిర‌ణ్

పి.ఆర్.ఓ.: వ‌ంశీ శేఖ‌ర్