అఖిల్ ‘హలో’ ట్రైలర్ అదిరింది

Friday,December 01,2017 - 06:30 by Z_CLU

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖిల్ మూవీ ‘హలో’ మూవీ ట్రైలర్ రిలీజయింది. రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ టీజర్ తో బజ్ క్రియేట్ చేసిన హలో టీమ్, ఇప్పుడు ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ లో మరింత జోష్ ని నింపేసింది. 2 నిమిషాల 5 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది.

రీసెంట్ గా రిలీజైన టీజర్ తో మూవీ థీమ్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఈ ట్రైలర్ తో రమ్యకృష్ణ తో పాటు, అజయ్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన హలో టీమ్, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ని అంతే అందంగా ప్రెజెంట్ చేసింది. చిన్నప్పుడే దూరమైన తన ప్రేమను వెదుక్కుంటూ వెళ్ళే ఒక యంగ్ స్టర్ చుట్టూ తిరిగే కథతో విక్రమ్ కుమార్ ఏ  రేంజ్ లో  మ్యాజిక్ క్రియేట్  చేసి  ఉంటాడో   ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.

డిసెంబర్ 22 న రిలీజ్ కానున్న ఈ మూవీపై టాలీవుడ్ లో ఇప్పటికే హై ఎండ్ డిమాండ్ క్రియేట్ అయి ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాలో కళ్యాణి హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు మరో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.