అల్లు అర్జున్ ఇంటర్వ్యూ

Monday,May 14,2018 - 04:24 by Z_CLU

కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే కాదు, టాలీవుడ్ లో ఎంతోమంది ప్రముఖుల్ని ఇన్ స్పైర్ చేస్తోంది నా పేరు సూర్య సినిమా. సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లో కొనసాగుతున్న ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు క్రిష్. దేశభక్తిని పెంపొందించేలా, క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా తెరకెక్కిన ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకున్నాడు. హీరో బన్నీ, దర్శకుడు వక్కంతంతో కలిసి స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు క్రిష్. ఈ సందర్భంగా సినిమా గురించి, దేశం గురించి బన్నీ ఏమన్నాడో చూద్దాం.

 

సినిమాలో బాగా నచ్చిన పాయింట్

సినిమాలో ఒక సిచ్యువేషన్ లో హీరో అనే డైలాగ్  ‘నేను కరెక్టో, రాంగో నాకు తెలీదు కానీ ఇది నా రియల్. ఇదే నేను’. అదే నాకు నచ్చిన పాయింట్. అది మ్యాగ్జిమం ఆడియెన్స్ కి రీచ్ అయిందనే అనుకుంటున్నా. 

 

ఫెయిలైనా పర్వాలేదు…

నమ్మింది చేయాలనేది నా ఫిలాసఫీ. ఎవరో చెప్పింది విని సక్సెస్ అవ్వడం కన్నా, మనం నమ్ముకున్నదాంట్లో ఫెయిల్ అయినా సంతోషం ఉంటుంది. బిగినింగ్ లో వచ్చే ఫెయిల్యూర్స్ ని అవాయిడ్ చేసి గట్టిగా ట్రై చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు.

 

 

మనమే దేశం…

దేశం అంటేనే మనం… ఇండియా అంటే 120 కోట్ల ఆటిట్యూడ్స్, మన దేశానికి బెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం బెస్ట్ గా ఉంటే చాలు… ఆ ప్రాసెస్ లో చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది. డెఫ్ఫినేట్ గా కొంచెం కష్టమే కానీ, అయినా అటువంటి పరిస్థితుల్లోను మనం బెస్ట్ గా ఉండగలిగితే దేశానికి చాలా చేసినట్టు…

 

రెండు చోట్ల రియలైజ్ అయ్యా

మిలిటరీలో ప్రతీది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నేను జమ్మూ లో షూట్ చేస్తున్నప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, అసలు ఏ సౌకర్యాలు ఉండవు… ఈ రోజు ఒక చోట ఉంటే, నెక్స్ట్ డే మొత్తం ప్యాక్ చేసుకుని ఇంకో చోటికి  వెళ్లిపోవాలి… అంత కష్టంలో కూడా ఏదో కష్టపడిపోతున్నాం అన్నట్టు ఉండరు… చాలా సరదాగా ఉంటారు… ఇంకో చోట మైనస్ 15 డిగ్రీల చలిలో ఐస్ లో నిలబడే పరిస్థితి ఉంటుంది. మనకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఇబ్బంది పడతాం. అలాంటిది వాళ్ళు నిజంగా గ్రేట్ అనిపించింది..  

 

 

నాక్కూడా తెలీదు…

చాలా ఓపెన్ గా చెబుతున్నాను. కథల్లో ఏది కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. దర్శకుడు కథ చెప్పేవరకు ఓపెన్ మైండ్ తో ఉంటాను. ఉదాహరణకు వక్కంతం కథ చెప్పేవరకు, ఆ స్టోరీలైన్ నాకు తెలీదు. ఆడియన్స్ సినిమా చూసేముందు ట్రయిలర్ చూస్తారు. కానీ నేను కథ వినేముందు నాకు ట్రయిలర్ ఉండదు. అంతా బ్లాంక్. ఎవరు కథ చెప్పినా క్యారక్టరైజేషన్ నచ్చితే ఓకే చెప్పాను. సరైనోడు సినిమా కేవలం హీరో బాడీ లాంగ్వేజ్ నచ్చి ఒప్పుకున్నాను. ఆ టైమ్ లో అలా అనిపించి అది చేశాను. దీనికొక ఫార్ములా ఉండదు.

 

అందుకే అలా చేశాను…

సూర్య క్యారెక్టర్ కోసం కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నలుగురికి గుర్తుండిపోయేలా చేద్దాం అనుకున్నాను. అది కూడా ఎలా ఉండాలంటే.. క్లోజప్ షాట్ తో చూస్తే అది ఏ సినిమా అనేది చెప్పేయాలి. ఇప్పటివరకు నా ప్రతి సినిమాకు అదే చేశాను. నా క్లోజప్ షాట్ చూస్తే, అది ఏ సినిమా అనేది ఆడియన్స్ చెప్పేస్తారు. నా పేరు సూర్య కోసం కూడా అందుకే వెరైటీ హెయిర్ కట్ తో పాటు కనుబొమ్మ కట్ తో కనిపించాను.

 

చాలా జాగ్రత్త పడాలి…

 సైనికుడు అనేది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సైనికులు, ఉపాధ్యాయులు, రైతులకు నేను జీవితంలో అత్యధిక గౌరవం ఇస్తాను. అలాంటి పాత్ర పోషిస్తున్నప్పుడు  ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు తెలుసు. అంతేకాదు, సూర్య పాత్ర పోషించడం గౌరవంగా భావించాను. అందుకే నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతున్నాను. సెలబ్రిటీలకు గౌరవ సభ్వత్వం ఇస్తారు ఆర్మీలో. వెంటనే నేను దరఖాస్తు చేశాను. ఆర్మీ నుంచి ఇంకా అనుమతి రాలేదు. వచ్చిన వెంటనే జాయిన్ అవుతాను.