‘మహానటి’ సక్సెస్ సీక్రెట్ – ఓవర్ సీస్ వసూళ్లు

Monday,May 14,2018 - 01:38 by Z_CLU

ఈ నెల 9 న రిలీజయింది మహానటి. సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా జస్ట్ ఇండియాలోనే కాదు ఓవర్ సీస్ లోను భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా  పాజిటివ్ రివ్యూస్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ని పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికే 1.5 మిలియన్స్ ని క్రాస్ చేసిన ‘మహానటి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ మార్క్ ని ఎలివేట్ చేస్తుంది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని క్యాటగిరీస్ నుండి ప్రశంసలు దక్కడం విశేషం. స్క్రీన్ పై ఎంత సేపు కనిపించామా అనే క్యాలిక్యులేషన్స్ లేకుండా, కేవలం సావిత్రి పై ఉన్న అభిమానంతో మోహన్ బాబు లాంటి సీనియర్ యాక్టర్స్ దగ్గరి నుండి నాగచైతన్య లాంటి స్టార్ వరకు ఈ సినిమా కోసం పని చేయడంతో రిలీజ్ కి ముందు నుండే, ఈ బయోపిక్ చుట్టూ భారీ క్రేజ్ క్రియేట్ అయింది. దాంతో ‘మహానటి’ పర్ఫెక్ట్ గా భారీ స్థాయిలో ఆడియెన్స్ ని రీచ్ అయ్యేలా ఎట్రాక్ట్ చేసింది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.