సమంత సినిమాలో అడివి శేష్

Sunday,February 10,2019 - 10:06 by Z_CLU

ప్రస్తుతం భర్త చైతూతో కలిసి ‘మజిలీ’ సినిమా చేస్తున్న సమంత మరో వైపు నందినీ రెడ్డి డైరెక్షన్ లో మిస్ గ్రానీ రీమేక్ లో నటిస్తుంది.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ,లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటిస్తునారు. నాగ శౌర్య కూడా ఓ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అయితే సినిమాలో అడివి శేష్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. సమంత తో కలిసి ఒకే ఒక్క సీనులో ఈ యంగ్ హీరో కనిపిస్తాడని సమాచారం.

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నందినీ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఓ బేబీ’ అనే టైటిల్ ను పరిశీలుస్తున్నారు మేకర్స్. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.