ఎక్స్ క్లూజీవ్ : నిర్మాతగా మారనున్న కాజల్

Sunday,February 10,2019 - 11:02 by Z_CLU

తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కాజల్ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ త్వరలోనే నిర్మాతగా మారబోతుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా తన బ్యానర్ కి ‘కె.ఎ వెంచర్’ అనే పేరు పెట్టుకుందని, త్వరలోనే నిర్మాతగా మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతోందని సమాచారం.

అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలో సినిమా చేయబోతుంది కాజల్. ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్న కాజల్ ఈ ప్రాజెక్ట్ తోనే నిర్మాణంలోకి దిగనుందని టాక్. అన్నీ కుదిరితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే కాజల్ నుండి అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి నిర్మాతగా కాజల్ ఎలాంటి విజయ వంతమైన సినిమాలు నిర్మిస్తుందో… చూడాలి.