జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 10,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్.

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది.. ఇదే కరెక్ట్ టైం అని భావించి దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాద యాత్ర ఎలిమెంట్స్ తో ‘యాత్ర’ అనే సినిమాను తెరకెక్కించాడు మహి వి రాఘవ్… అస‌లు ఈ చిత్రం ఇప్ప‌డు తీయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమిటి.. రెండు సినిమాల అనుభవం ఉన్న మహి ఈ సినిమాను ఎలా డీల్ చేసాడు…ఇంతకీ యాత్రలో వై ఎస్ ఆర్ గురించి ఎంత వరకూ చూపించారు… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న దొరికిన కాస్త సమయాన్ని కూడా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాడు బన్ని. ఆ స్వీట్ మూమెంట్స్ ని అప్పుడపుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. గతంలో అల్లు అయాన్ తో అల్లరి చేసే వీడియోని షేర్ చేసి, సోషల్ మీడియా కాన్సంట్రేషన్ మొత్తాన్ని గ్రాబ్ చేసిన బన్ని, ఇప్పుడు అల్లు అర్హా తో చేసిన అల్లరిని షేర్ చేసుకున్నాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోజు రోజుకి మరింత పాపులర్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. జస్ట్ ఆన్ స్క్రీన్ మాత్రేమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా అదే స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. డిఫెరెంట్ మ్యానరిజంతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటాడు. అందుకే ఫోర్బ్స్ మ్యాగజైన్  ‘ 30 అండర్ 30 2019’ లో విజయ్ దేవరకొండ పేరును చేర్చింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా టీజర్ రిలీజయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రాజశేఖర్ జన్మదినం సందర్భంగా బర్త్ డే టీజర్ రిలీజ్ చేసారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నిఖిల్ సినిమా ‘ముద్ర’ టైటిల్ మారింది. తమిళ బ్లాక్ బస్టర్ ‘కణిదన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ‘అర్జున్ సురవరం’ గా థియేటర్ల లోకి రానుంది. మార్చి 29 న థియేటర్ల లోకి రానున్న ఈ సినిమాలో నిఖిల్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరునే టైటిల్ గా ఫిక్సయ్యారు మేకర్స్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి