Jawan బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న షారూఖ్

Tuesday,September 05,2023 - 02:20 by Z_CLU

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి జోరు చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాలు కూడా తెలుగు నాట ఈ సినిమా పఠాన్ ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పఠాన్ మొదటి రోజు ఇండియా లో 57 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా జవాన్ ఇప్పటికే ఆ ఫిగర్ దగ్గరలో ఉంది.

ప్రస్తుతం జావాన్ బుకింగ్స్ చూస్తుంటే సినిమాపై మూవీ లవర్స్ లో ఉన్న క్రేజ్ తెలుస్తుంది. అట్లీ డైరెక్షన్ లో షారూఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ లేటెస్ట్ బిగ్ హిట్ ‘గద్దర్ 2’ ఓపెనింగ్స్ కి కూడా దాటేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో షారూఖ్ ‘జవాన్’ 7 లక్షల టికెట్స్ సేల్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇక రికార్డ్స్ బ్రేక్ చేయడమే కింగ్ ఖాన్ తరువాత పని.

నయనతార , దీపికా పడుకునే , విజయ్ సేతుపతి , ప్రియమణి మిగతా తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 న హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.