యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ సినిమా రిలీజ్ కు రెడీ

Sunday,August 12,2018 - 01:53 by Z_CLU

యాక్షన్ హీరో అర్జున్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా… ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు.

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయికృష్ణ పెండ్యాల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ… మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు రీసెంట్ గా నటించిన “నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా”, “అభిమ‌న్యుడు” సినిమాల‌తో ఈ జ‌ెన‌రేష‌న్ ఆడియెన్స్ కి మరింత ద‌గ్గ‌ర‌య్యాడు. అలాంటి అర్జున్ అంటే తెలుగు ప్రేక్షకులుకు అమితమైన ప్రేమ. చాలా మందికి కష్టసాధ్యమైన ఫీట్ ను అర్జున్ ఇప్పుడు సాధించారు. అదే 150వ చిత్రం. అర్జున్ గారు నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం ను గ్రాండ్ లెవల్లో తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.

ఇప్పటికే నాచురల్ స్టార్ నాని ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశాడు. హాలీవుడ్ థ్రిల్లర్స్ ని తలపించేలా ఉందనే కామెంట్స్ అందుకుంది ఆ ట్రయిలర్. మ‌లయాళంలో మోహ‌న్ లాల్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్య‌నాథ‌న్ కురుక్షేత్రం ను అద్యంతం ఆస‌క్తిగా మ‌లిచారు. అర్జున్ తో పాటు ప్ర‌స‌న్న‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, సుమ‌న్, సుహాసిని, వైభ‌వ్, శ్రుతి హరిహర‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.