హిట్ సినిమాకు సీక్వెల్.. రెడీ ఫర్ రిలీజ్

Thursday,November 22,2018 - 04:27 by Z_CLU

ప్రేమకథా చిత్రమ్.. హారర్-కామెడీ జానర్ కు ఫౌండేషన్ వేసిన సినిమా. ఈ సినిమా సక్సెస్ తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సినిమాలు ముంచెత్తాయి. మళ్లీ ఇన్నేళ్లకు ప్రేమకథాచిత్రమ్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్, సిద్ధి ఇద్నానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేం నందిత శ్వేత నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. జనవరిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలోనే భారీ ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాతో హరికిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.