రెడీ ఫర్ రిలీజ్

Thursday,June 13,2019 - 10:03 by Z_CLU

లాస్ట్ వీకెండ్ లాగే ఈ వీకెండ్ స్టార్ హీరో సినిమా లేకపోవడం చిన్న సినిమాలకు భలే కలిసొచ్చింది. అందుకే తెలుగులో ఏకంగా 6 సినిమాలు రిలీజవుతున్నాయి.

విశ్వామిత్ర : నందితా రాజ్ లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. ప్రసన్న కుమార్ సినిమాలో పోలీసాఫీసర్ గా నటించాడు. మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14 న రిలీజవుతుంది.

వజ్రకవచధర గోవింద : సప్తగిరి హీరోగా నటించిన వజ్ర కవచధర గోవింద. సినిమా ట్రైలర్ ని సినిమాలో జస్ట్ కామెడీనే కాకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ కూడా ఉన్నట్టే అనిపిస్తుంది. చూడాలి ఈ నెల 14 న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఇంప్రెస్ చేస్తుందో…

గేమ్ ఓవర్ : తాప్సీ నటించిన సినిమా. రిలీజ్ కి ముందే ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వడం కలిసొచ్చే విషయమే. ఈ జూన్ 14 రిలీజ్ డేట్. చూడాలి మరీ… సినిమా అంచనాలు ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.

ఐ లవ్ యు : ఉపేంద్ర, రచితా రామ్ జంటగా నటించిన సినిమా ఇది. తెలుగులో డబ్బింగ్ సినిమాగా రిలీజవుతుంది. జూన్ 14 రిలీజ్ డేట్.

ఈ సినిమాలతో పాటు మరో 2 సినిమాలు ‘ఏక్’, ‘సీబీఐ వెర్సెస్ లవర్స్’ కూడా ఈ వీకెండ్ కే థియేటర్స్ లోకి వస్తున్నాయి.