వీకెండ్ రిలీజ్

Thursday,February 27,2020 - 11:00 by Z_CLU

ఈ వీకెండ్ కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. పేరుకు ఇవి  చిన్న సినిమాలే అయినప్పటికీ కంటెంట్ పరంగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే ఈ వీకెండ్ బాక్సాఫీస్ పై ఆడియన్స్ ఫోకస్ పెరిగింది.

 ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న మూవీ ‘రాహు’. పూర్తిగా కంటెంట్ ను నమ్ముకొని దర్శకుడు సుబ్బు వేదుల తెరకెక్కించిన సినిమా ఇది. కృతి గార్గ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో అభిరామ్, కాలకేయ ప్రభాకర్, సత్యంరాజేష్ కీలక పాత్రలు పోషించారు. సుబ్బు వేదుల ఈ సినిమాను డైరక్ట్ చేయడంతో పాటు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

 ‘రాహు’ సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడు బ్లైండ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో ‘రాహు’ ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో ఇంటరెస్టింగ్ గా చూపించారు. సినిమా కంప్లీట్ గా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మేకింగ్ స్టయిల్ ఆడియన్స్ కు థ్రిల్ కలిగిస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లో ఇదొక కొత్త ప్రయోగం.

 

‘రాహు’తో పాటు వస్తున్న మరో సినిమా ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నాని నిర్మాత. మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కొత్త తరహా ఎక్స్ పీరియన్స్ ఇస్తుందంటున్నాడు విశ్వక్ సేన్. శైలేష్ కొలను డైరక్ట్ చేసిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ డైరక్టర్. మొదటి సినిమా “అ!”తో నిర్మాతగా ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేకపోయిన నాని, హిట్ తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి

 

ఈ రెండు సినిమాలతో పాటు ‘స్వేచ్ఛ’, ‘లోకల్ బాయ్’, ‘కనులు కనులను దోచాయంటే’ అనే మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. సింగర్ మంగ్లీ హీరోయిన్ గా మారి చేసిన సినిమా ‘స్వేచ్ఛ’. ఇక ధనుష్-మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘లోకల్ బాయ్’, దుల్కర్ సల్మాన్-రీతూవర్మ హీరోహీరోయిన్లుగా ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాలు కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ రెండూ డబ్బింగ్ సినిమాలు.