లాక్ డౌన్ తర్వాత ఎనౌన్స్ మెంట్

Wednesday,May 27,2020 - 04:36 by Z_CLU

మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ లో చిరుతో జోడీ కట్టిన కాజల్ అగర్వాల్ మరోసారి ‘ఆచార్య’ లో హీరోయిన్ గా కనిపించబోతుంది. సినిమాకు ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె అనుకోకుండా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వెంటనే కాజల్ ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసుకొని అడ్వాన్స్ అందించారు.

అయితే మెగాస్టార్ తో మరోసారి హీరోయిన్ గా కాజల్ అంటూ మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చే లోపే కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడటం జరిగింది. అందుకే అనౌన్స్ మెంట్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు.

లాక్ డౌన్ పూర్తవ్వగానే “వెల్ కం టు ది ప్రాజెక్ట్” అంటూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి మెగాస్టార్ తో మళ్ళీ నటించబోతున్న కాజల్ ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.