Acharya కాజల్ ఎంట్రీ ఇచ్చింది!

Tuesday,December 15,2020 - 01:34 by Z_CLU

కోవిడ్19 కారణంగా వాయిదా పడిన Acharya షూటింగ్ మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే.  కొరటాల శివ డైరెక్షన్ లో యాక్షన్ డ్రామాగా  తెరకెక్కుతున్న  ఈ సినిమా షూటింగ్ కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. తాజాగా సినిమా షూటింగ్ లో కాజల్ జాయిన్ అయింది.  ప్రస్తుతం చిరు -కాజల్ లపై సాంగ్ షూట్ చేస్తున్నారు.

షూటింగ్ కి  భర్త గౌతం కిచ్లుతో కలిసి వచ్చిన కాజల్ కు గ్రాండ్ గా స్వాగతం పలికారు యూనిట్. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జంటను ఆశీర్వదించి పుష్ప గుచ్చాన్ని అందించారు. అనంతరం కాజల్ తన భర్తతో కలిసి దండలు మార్చుకొని కేక్ కట్ చేసింది. ఈ సాంగ్ తర్వాత చిరు , కాజల్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు.

వచ్చే నెల నుండి రామ్ చరణ్ కూడా షూట్ లో పాల్గొని తన పార్ట్ ఫినిష్ చేయనున్నాడని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ , మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్స్ లోకి రానుంది.

Also Check ఆచార్య కోసం చరణ్ డేట్స్ బ్లాక్