#Mahesh27... టైటిల్ ఫిక్స్ అయినట్టేనా?

Wednesday,May 27,2020 - 02:07 by Z_CLU

ప్రస్తుతం మహేష్ 27 సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. టైటిల్ ఇదేనంటూ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. అభిమానుల్ని అంతలా ఎట్రాక్ట్ చేస్తున్న ఆ టైటిల్ ‘సర్కార్ వారి పాట’. ఏవైనా ప్రాపర్టీస్ వేలం వేసేముందు ప్రభుత్వం తరుపున సర్కార్ వారి పాట అనే పదం వింటుంటాం. ఇప్పుడు అదే మహేష్ సినిమాకు టైటిల్ అనేసరికి అందరిలో ఆసక్తి పెరిగింది.

అయితే యూనిట్ మాత్రం ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటుంది. ఇంకా ఫైనల్ అవ్వలేదని చెప్తుంది. మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. అదే రోజు కొద్ది మందితో లాంచ్ కూడా అనుకుంటున్నారు.

మరి అప్పుడే సినిమా టైటిల్ రివీల్ చేస్తారా లేదా సినిమా పూర్తయ్యే వరకు వర్కింగ్ టైటిల్ గానే కన్సిడర్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని అనుకుంటున్నారు. ఇంతకుముందు మహేష్-కియరా కాంబోలో భరత్ అనే నేను సినిమా వచ్చింది.