చిరు 'ఆచార్య'... హీరోయిన్స్ ఎంత మంది?

Friday,July 17,2020 - 01:12 by Z_CLU

మెగాస్టార్ , కొరటాల కాంబో ఫిక్సయినప్పటి నుండి సినిమా గురించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమాలో నలుగురు హీరోయిన్స్ అనే కొత్త ప్రచారం జోరుగా సాగుతుంది. అవును.. మెగాస్టార్ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారట. ఇప్పటికే చిరు సరసన హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేసారు. త్వరలోనే ఆమె పేరును అనౌన్స్ చేయనున్నారు. అయితే సినిమాలో తమన్నా కూడా ఓ స్పెషల్ రోల్ చేయనుందని టాక్.

సినిమాలో వచ్చే ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరు సరసన మరో హీరోయిన్ గా తమన్నా కనిపించనుందని అంటున్నారు.

ఇక సినిమాలో రెజినా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కి కూడా ఓ హీరోయిన్ ఉంది. చరణ్ సరసన కీర్తిసురేష్ ను అనుకుంటున్నారు. అంటే చరణ్ హీరోయిన్ తో కలిసి నలుగురు హీరోయిన్స్ అన్నమాట. ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.