చిరు-కొరటాల మూవీ.. తెరపైకి మరో హీరోయిన్

Monday,July 29,2019 - 12:18 by Z_CLU

త్వరలోనే ప్రారంభం కానున్న చిరంజీవి, కొరటాల శివ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో శృతిహాసన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కాజల్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే కాజల్ నే మరోసారి రిపీట్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారట.

ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ అయిన వెంటనే తమన్న పేరు గట్టిగా వినిపించింది. మెగాస్టార్ సరసన నటించడానికి తను రెడీ అంటూ మిల్కీబ్యూటీ కూడా గతంలో ప్రకటించింది. అయితే ఆ తర్వాత శృతిహాసన్ పేరు బాగా వినిపించింది. కొరటాల డైరక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ నటించింది. కాబట్టి, ఆ రిఫరెన్స్ తో చిరంజీవి సరసన ఆమెను తీసుకున్నారంటూ గాసిప్స్ వినిపించాయి.

మొన్నటివరకు శృతిహాసన్ పేరు దాదాపు ఫిక్స్ అనుకున్నారు. ఇప్పుడు సడెన్ గా కాజల్ పేరు బయటకొచ్చింది. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్-150లో కాజల్ హీరోయిన్ గా నటించింది. కొరటాల సినిమా కోసం మరోసారి కాజల్ నే రిపీట్ చేయాలని అనుకుంటున్నారట. సైరా రిలీజైన తర్వాత హీరోయిన్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది.